ఇంటి స్థలంలో పోలీస్‌ కంచె

ABN , First Publish Date - 2020-12-30T09:06:26+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో రెవెన్యూ శాఖ, పోలీసుల మధ్య భూవివాదం నెలకొంది. పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి సర్వే నం.96/2లో ఎకరం ఏడు సెంట్ల విస్తీర్ణంలో 45 మంది లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే బాలరాజు చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు.

ఇంటి స్థలంలో  పోలీస్‌ కంచె

జీలుగుమిల్లి, డిసెంబరు 29: పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో రెవెన్యూ శాఖ, పోలీసుల మధ్య భూవివాదం నెలకొంది. పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి సర్వే నం.96/2లో ఎకరం ఏడు సెంట్ల విస్తీర్ణంలో 45 మంది లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే బాలరాజు చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇంతలో మంగళవారం పోలీసులు రంగప్రవేశం చేశారు. లే అవుట్‌ వేసిన స్థలం తమ శాఖకు చెందిందని ఫ్లెక్సీ పెట్టారు. ఆ స్థలంలో గతంలో సీజ్‌ చేసిన మోటారు సైకిళ్లను తెచ్చి ఉంచారు. అనంతరం ఎస్సై కె.విశ్వనాథబాబు ఆ స్థలానికి కంచె వేశారు. రెవెన్యూ అధికారులు, ప్రజలు అవాక్కయ్యారు. ఈ రెండు శాఖల వివాదంతో పట్టాల పంపిణీ వాయిదాపడింది. 

Updated Date - 2020-12-30T09:06:26+05:30 IST