మసకబారుతున్న పోలీస్‌ ప్రతిష్ఠ: వర్ల

ABN , First Publish Date - 2020-03-19T10:16:48+05:30 IST

‘‘ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడే పోలీసులు దైవంతో సమానం. అలాంటి పోలీస్‌ వ్యవస్థ ప్రతిష్ఠ కొందరు పోలీస్‌ అధికారుల వ్యవహార శైలి వల్ల ...

మసకబారుతున్న పోలీస్‌ ప్రతిష్ఠ: వర్ల

మంగళగిరి, మార్చి 18: ‘‘ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడే పోలీసులు దైవంతో సమానం. అలాంటి పోలీస్‌ వ్యవస్థ ప్రతిష్ఠ కొందరు  పోలీస్‌ అధికారుల వ్యవహార శైలి వల్ల మసకబారుతోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసు వ్యవస్థ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీని అత్యధిక స్థానాల్లో గెలిపించి జగన్‌కు కానుకగా ఇస్తానని ఓ పోలీస్‌ అధికారి అంటే, ఇది నెంబర్‌ 2 మంత్రి నియోజకవర్గమని, ఇక్కడ వేరే పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి వీల్లేదని మరో పోలీస్‌ అధికారి బెదిరించారని గుర్తు చేశారు. అధికారపార్టీకి కొమ్ముకాస్తున్న ఐదుగురు పోలీస్‌ అధికారులపై ప్రైవేటు కేసులు వేసేందుకు టీడీపీ సిద్ధమైందని వర్ల ప్రకటించారు.


Updated Date - 2020-03-19T10:16:48+05:30 IST