వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-04-14T18:31:58+05:30 IST

నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది.

వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు

కర్నూలు : నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై కూడా  కేసు నమోదు చేయడం జరిగింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో హైపో ద్రావణం స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి, లబ్బి ఇద్దరూ పాల్గొన్నారు. అయితే స్ప్రే చేయిస్తున్న సమయంలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకపోవడంతో కేసు నమోదైంది. ఈ కేసు వ్యవహారంపై బైరెడ్డీ కానీ.. లబ్బి కానీ ఇంతవరకూ స్పందించలేదు.


కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హైపో ద్రావణాన్ని ప్రజా ప్రతినిధులు, ఇంచార్జ్‌లు దగ్గరుండి పిచికారి చేయిస్తున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2020-04-14T18:31:58+05:30 IST