డాక్టర్ సుధాకర్‌పై పోలీసుల తీరు దారుణం: టీడీపీ నేత

ABN , First Publish Date - 2020-05-17T18:04:19+05:30 IST

డాక్టర్ సుధాకర్‌పై విశాఖ పోలీసులు అనుసరించిన తీరు దారుణంగా ఉందని..

డాక్టర్ సుధాకర్‌పై పోలీసుల తీరు దారుణం: టీడీపీ నేత

విశాఖ: డాక్టర్ సుధాకర్‌పై విశాఖ పోలీసులు అనుసరించిన తీరు దారుణంగా ఉందని టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు అన్నారు. ఆదివారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ దళితులను అణచివేసేందుకు దశలవారీగా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. నేరస్తులు, ఉగ్రవాదులపట్ల అనుసరించినట్లుగా పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఘటనపై మానవహక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


డాక్టర్లకు మాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు పిచ్చోడుగా ముద్ర వేసి, విశాఖ నడిరోడ్డుపై ఆయనను తాళ్లతో కట్టి.. కొడుతూ పశువు మాదిరిగా ఆయనను ఆటోలో వేసుకుని వెళ్లడం చాలా దారుణమని రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయించడం, జైల్లో పెట్టడం, ఆయా కుటుంబాలను పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేయడం పరిపాటిగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో దళితులను అణచివేసేందుకు దశలవారీగా కుట్రలు జరుగుతున్నాయని రాజు విమర్శించారు.

Updated Date - 2020-05-17T18:04:19+05:30 IST