డాక్టర్ సుధాకర్‌పై పోలీస్ దాష్టీకం
ABN , First Publish Date - 2020-05-17T09:46:02+05:30 IST
కరోనాకు చికిత్స చేసే వైద్యులకు ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసి స స్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్థిషియన్ డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖపట్నం ..

నడిరోడ్డుపై చేతులు వెనక్కి విరిచి
తాళ్లతో బంధించిన విశాఖ పోలీసులు
లాఠీతో కొట్టి.. స్టేషన్‌కు తరలింపు
మతిస్థిమితం లేదని పిచ్చాసుపత్రికి
మాస్కులు లేవని ఆరోపించడంతో
ఇటీవల డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్
ఓ కానిస్టేబుల్‌ని తొలగించాం: సీపీ
విశాఖపట్నం, అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): కరోనాకు చికిత్స చేసే వైద్యులకు ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసి స స్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్థిషియన్ డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖపట్నం పోలీసులు శనివారం దారుణంగా వ్యవహరించారు. ఆయన చేతు లు వెనక్కివిరిచి, తాళ్లతో కట్టి, లాఠీతో కొట్టారు. ఆయ న అర్థం లేకుండా మాట్లాడుతుండడంతో మతిస్థిమి తం లేదని భావించి, పెదవాల్తేరులోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్ నెల రోజుల క్రితం నర్సీపట్నం ఆస్పత్రిలో కరోనా చికిత్సకు పరికరాలు ఇవ్వడం లేదని మీడియా ముందు మాట్లాడారు. దానిని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుని సస్పెండ్ చే సింది.
విశాఖపట్నంలో నివాసం ఉండే ఆయన, శనివా రం సాయంత్రం తన కారులో జాతీయ రహదారిపై వెళుతూ అక్కయ్యపాలెంలోని పోర్టు ఆస్పత్రి వద్ద ఆగా రు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు గానీ, ఎవరో 100 నంబర్‌కు డయల్ చేశారు. నాలుగో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో సుధాకర్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, రహదారిపై వా హనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారు. ఆయనను ఓ కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడు. దాంతో సుధాకర్ ‘‘నేను ఆస్పత్రిలో లోపాలు బయటపెట్టాను. అందుకని ఎమ్మెల్యే పెట్ల గణేశ్ నన్ను టార్గెట్ చేశారు. పోలీసులను పంపించారు. నన్ను చంపేస్తారు.. రక్షించండి’’ అంటూ రోడ్డుపై దొర్లుతూ గుమిగూడిన వారిని ప్రాధేయపడడం ప్రారంభించారు. ఇంతలో పోలీసులు.. ఆయన మెడపై లాఠీ పెట్టి, రెండు చేతులు వెనక్కివిరి చి, తాళ్లతో బంధించారు.
డీజీపీని పిలిపిస్తాం: ఎస్సీ కమిషన్
డాక్టర్ సుధాకర్‌ను వేధింపులకు గురిచేసిన వారందరినీ ఎస్సీ వేధింపుల నిరోధక చట్టం కింద శిక్షిస్తామ ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె.రాములు చెప్పా రు. డీజీపీ, విశాఖ సీపీలను పిలిపించి.. బాధ్యులపై చ ర్యలు తీసుకొనేలా ఆదేశాలు ఇస్తానని స్పష్టం చేశారు. కాగా, ‘డాక్టర్ సుధాకర్ రక్తంలో మద్యం శాతం ఉన్నందున ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం. అనంతరం మానసిక ఆస్పత్రికి తరలించారు’’ అని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ తెలిపారు. కాగా, సుధాకర్ ‘ఎక్యూ ట్ అండ్ ట్రాన్సియంట్ సైకోసిస్’ అనే మానసిక రుగ్మతతో బాధ పడుతున్నట్టు నిర్ధారించామని డాక్టర్ రాధారాణి వెల్లడించారు.
10 లక్షలు, కారు లాక్కున్నారు: సుధాకర్
‘‘రుణం తీర్చడానికి తీసుకువెళుతున్న రూ.10 లక్షల నగదును, కారును పోలీసులు తీసుకున్నారు. వెంటనే వాటిని ఇప్పించాలి. నన్ను కేజీహెచ్ నుంచి మానసిక వైద్యశాలకు తీసుకువెళుతున్నారు’’
మద్యం మత్తులో ఉన్నారు: విశాఖ సీపీ
‘‘డాక్టర్ సుధాకర్ మద్యం మత్తులో ఉన్నారు. వాహనాలకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో డాక్టర్ దు రుసుగా ప్రవర్తించి ట్రాఫిక్ కానిస్టేబుల్ సెల్‌ఫోన్ లాక్కొని విసిరేశారు. కేజీహెచ్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. డాక్టర్‌ను లాఠీతో కొట్టిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశాం’’