రైల్వే ఉద్యోగినిపై కానిస్టేబుల్ అత్యాచారం

ABN , First Publish Date - 2020-05-17T15:39:28+05:30 IST

రైల్వే ఉద్యోగినిపై కానిస్టేబుల్ అత్యాచారం

రైల్వే ఉద్యోగినిపై కానిస్టేబుల్ అత్యాచారం

అనంతపురం: జిల్లాలోని హిందూపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఉద్యోగిని పై APSP 14th  బెటాలియన్  కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వలి లాక్ డౌన్‌లో భాగంగా హిందూపురం పట్టణంలో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే వాహనాలు తనిఖీల్లో భాగంగా రైల్వే గేట్ కీపర్‌గా ఉద్యోగం చేస్తున్న మహిళతో హుస్సేన్ వలి పరిచయం ఏర్పర్చుకున్నాడు. పరిచయం ఆసరాగా చేసుకుని రైల్వే ఉద్యోగిని ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కానిస్టేబుల్ హుస్సేన్ వలిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-05-17T15:39:28+05:30 IST