మందడంలో పోలీసుల హైఅలర్ట్‌

ABN , First Publish Date - 2020-03-27T16:26:00+05:30 IST

ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌కు వస్తున్న నేపథ్యంలో..

మందడంలో పోలీసుల హైఅలర్ట్‌

అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌కు వస్తున్న నేపథ్యంలో మందడంలో పోలీసుల హైఅలర్ట్‌ ప్రకటించారు. దీక్షా శిబిరంలో రైతులు లేకపోయినా భారీగా పోలీసులు మోహరించారు. అయితే గుంపులుగా తిరగొద్దని గ్రామస్తులకు చెప్పి భారీగా పోలీసుల మోహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు మాస్క్‌లు ఇవ్వకపోవడంతో సిబ్బంది రుమాళ్లతో సరిపెట్టుకున్నారు. మాస్క్ తప్పనిసరి కాకపోయినా నిత్యం రోడ్‌లపై ఉండే తమకైనా ప్రభుత్వం సరఫరా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో కేబినెట్‌ రక్షణకు ఉపయోగించే పోలీసులకు కూడా మాస్క్‌లు లేవు.

Updated Date - 2020-03-27T16:26:00+05:30 IST