పోలీసులకు 50 వేల మాస్కులు

ABN , First Publish Date - 2020-04-05T08:38:05+05:30 IST

లాక్‌ డౌన్‌ విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులకు 50 వేల మాస్క్‌లు డీజీపీ కార్యాలయం సరఫరా చేసింది. దాతల సహకారంతో పోలీసులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. మొదటి ప్రాధాన్యం 4 వేల

పోలీసులకు 50 వేల మాస్కులు

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): లాక్‌ డౌన్‌ విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులకు 50 వేల మాస్క్‌లు డీజీపీ కార్యాలయం సరఫరా చేసింది.  దాతల సహకారంతో పోలీసులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. మొదటి ప్రాధాన్యం 4 వేల మంది మహిళా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు ఇస్తున్నామని చెప్పారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం భారీగా మాస్క్‌లు విరాళంగా ఇచ్చిన స్పిన్‌ టెక్స్‌ సంస్థకు డీజీపీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - 2020-04-05T08:38:05+05:30 IST