మార్చికి 41.15 మీటర్లు

ABN , First Publish Date - 2020-11-13T09:41:55+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వను మార్చినాటికి 41.15 మీటర్లకు పరిమితం చేసి... దానిని డిసెంబరు నాటికి 45.72 మీటర్లకు తీసుకెళతామని పో

మార్చికి 41.15 మీటర్లు

డిసెంబరుకు 45.72 మీటర్లు

దశలవారీగా పెంచుతాం: సీఈ


అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వను మార్చినాటికి 41.15 మీటర్లకు పరిమితం చేసి... దానిని డిసెంబరు నాటికి 45.72 మీటర్లకు తీసుకెళతామని పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీరు బి.సుధాకరబాబు వివరించారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘41.15 మీటర్లే!’ కథనంపై సుధాకరబాబు స్పందించారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు పోలవరం నిర్మించే ప్రతిపాదనలో మార్పు లేదన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ నాటికి కుడి,ఎడమ ప్రధానకాలువల ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారని, ఇందుకోసం డ్రైవింగ్‌హెడ్‌తో కలిపి డ్యామ్‌లో 38మీటర్ల నీటిమట్టం కొనసాగించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2020-11-13T09:41:55+05:30 IST