ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలంరెడ్డి విమర్శలు

ABN , First Publish Date - 2020-05-10T01:15:00+05:30 IST

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కోవూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శలు గుప్పించారు.

ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలంరెడ్డి విమర్శలు

నెల్లూరు: కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కోవూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలని ఆయన అన్నారు. అందుకు ఆయన‌ తల్లి చొరవ తీసుకోవాలన్నారు. వైజాగ్ గ్యాస్ లీకేజీ సంఘటనపై ప్రసన్నకి‌ కనీస అవగాహన లేదని విమర్శించారు. మాజీ‌ సీఎం చంద్రబాబు కోటి రూపాయల నష్ట పరిహారం గురుంచి విమర్శించలేదని, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ మీద సీఎం చూపుతున్న ఉదార స్వభావాన్నే చంద్రబాబు విమర్శించారని పోలంరెడ్డి అన్నారు. ప్రసన్న తన దిగజారుడు భాషతో కోవూరు నియోజకవర్గ పరువు తీస్తున్నాడని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2020-05-10T01:15:00+05:30 IST