ప్రధాని చెప్పింది విందాం.. లాక్‌డౌన్‌పై పవన్ ట్వీట్

ABN , First Publish Date - 2020-03-23T19:37:34+05:30 IST

కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ మాటను పాటిద్దామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

ప్రధాని చెప్పింది విందాం.. లాక్‌డౌన్‌పై పవన్ ట్వీట్

అమరావతి: కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ మాటను పాటిద్దామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని మాట పాటిద్దాం, కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. మనలని మనం రక్షించుకుందాం. దయచేసి అందరు కరోనా వ్యాధి తీవ్రతని గుర్తించాలి, లాక్ డౌన్‌ని విధిగా పాటించాలి. కేంద్ర  ప్రభుత్వ ఆదేశాలను, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలి’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 


కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా విధిస్తున్న లాక్‌డౌన్‌లను చాలా మంది ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా పరిగణించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఆయన ఈ విషయమై మరింత అప్రమత్తం చేస్తూ... 'లాకౌడౌన్‌లను చాలా మంది సీరియస్‌గా తీసుకోవడం  లేదు. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమ, నిబంధనలు తు.చ తప్పకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని హిందీలో పోస్ట్ చేసిన ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-23T19:37:34+05:30 IST