మోదీ పిలుపును పాటిద్దాం

ABN , First Publish Date - 2020-03-21T09:23:48+05:30 IST

కరోనాపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. మోదీ సూచనలను ప్రజలంతా అనుసరించాలని,

మోదీ పిలుపును పాటిద్దాం

  • జనతా కర్ఫ్యూలో అందరూ భాగస్వాములు కావాలి: పవన్‌

అమరావతి, హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. మోదీ సూచనలను ప్రజలంతా అనుసరించాలని, 22న జనతా కర్ఫ్యూగా పాటించాలని కోరారు. ఆ రోజు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. కరోనా ప్రమాదకరం అని తెలిసినప్పటికీ దానిని నిర్మూలించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులందరికీ ప్రజలంతా కృతజ్ఞతలు తెలపాలన్నారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు ఇంటి బాల్కనీల్లో నిలబడి కరతాళ ధ్వనుల ద్వారా వారికి సంఘీభావం తెలుపుదామని పేర్కొన్నారు. ఆ రోజున హైదరాబాద్‌లోని తన నివాసంలో గంటానాదం పేరిట.. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులు, పారామెడికల్‌, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు పవన్‌ వెల్లడించారు.

Updated Date - 2020-03-21T09:23:48+05:30 IST