పీఎల్జీఏ వారోత్సవాలతో అప్రమత్తం
ABN , First Publish Date - 2020-12-03T09:01:31+05:30 IST
పీఎల్జీఏ వారోత్సవాలతో అప్రమత్తం

చింతూరు, డిసెంబరు 2: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) వారోత్సవాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఏటా మావోయిస్టు పార్టీ డిసెంబరు రెండు నుంచి వారం రోజులపాటు పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులు కరపత్రాలను విడిచిపెట్టడంతో మన రాష్ట్ర పోలీసు యంత్రాంగంతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ క్రమంలో మన్యంలో రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు.