పితాని కుమారుడి కోసం గాలిస్తున్న ఏసీబీ
ABN , First Publish Date - 2020-07-10T21:36:55+05:30 IST
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో పితాని కుమారుడు వెంకటేష్ ఆజ్ఞాతంలోకి వెళ్లారు.
విజయవాడ: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో పితాని కుమారుడు వెంకటేష్ ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ అరెస్ట్ నేపథ్యంలోనే హైకోర్టులో ముందుస్తు బెయిల్ వెంకటేష్ దాఖలు చేశారు. ఇప్పటికే పితాని మాజీ పీఎస్ మురళిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మురళీమోహన్ నుంచి వెంకటేష్‌ల సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. మాజీ మంత్రి పితాని పీఎస్ మురళీమోహన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసింద. మురళీమోహన్, పితాని సత్యనారాయణకు పీఎస్‌గా పనిచేశారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ సెక్షన్ ఆఫీసర్‌గా మురళీమోహన్ పనిచేస్తున్నారు. ఈ ఉదయం సచివాలయంలో మురళిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితులుగా ఉన్న పితాని సత్యనారాయణ కుమారుడు వెంకటేష్, మాజీ కార్యదర్శి మురళీమోహన్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత గురువారం ఈ పిటిషన్లపై విచారణ జరిపారు. కేవలం రాజకీయ కక్షతో ఈ కేసులో ఇరికించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చల్లా అజయ్‌కుమార్ వాదించారు. వెంకటేష్ ఏనాడూ తన తండ్రి పదవిని దుర్వినియోగం చేయలేదని వివరించారు. ఆయన వద్ద కార్యదర్శిగా ఉన్న మురళీమోహన్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొన్నారు. అందువల్ల ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. వీరి వాదనతో ఏసీబీ తరఫు న్యాయవాది విభేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వులో ఉంచారు.