గుండెపోటుతో ఫొటోగ్రాఫర్‌ మృతి

ABN , First Publish Date - 2020-02-12T09:33:43+05:30 IST

అమరావతి తరలిపోతుందనే మనోవేదనకుగురై తుళ్లూరులో సీనియర్‌ ఫొటో గ్రాఫర్‌గా అందరికీ సుపరిచితుడైన మహ్మద్‌ బాబు(60) మంగళవారం గుండె పోటుతో...

గుండెపోటుతో ఫొటోగ్రాఫర్‌ మృతి

తుళ్లూరు: అమరావతి తరలిపోతుందనే మనోవేదనకుగురై తుళ్లూరులో సీనియర్‌ ఫొటో గ్రాఫర్‌గా అందరికీ సుపరిచితుడైన మహ్మద్‌ బాబు(60) మంగళవారం గుండె పోటుతో మృతి చెందారు. బాబుకు సొంత ఇల్లు లేదు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఆవాస్‌ యోజన కింద పేదలకు రాజధానిలో ఇళ్ల సముదాయాలను నిర్మించింది. దీనిలో ఫొటోగ్రాఫర్‌ బాబు కూడా అర్హత పొందాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజధానిలో నిర్మించిన ఇళ్ల గురించి ప్రస్తావన లేదు. దీంతో మానసిక వేదనకులోనై మృతి చెందారు. 


Updated Date - 2020-02-12T09:33:43+05:30 IST