జూలకల్లు గ్రామంలో కొండముచ్చు హల్‌చల్..

ABN , First Publish Date - 2020-12-30T17:12:33+05:30 IST

గుంటూరు: పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో కొండముచ్చు హల్ చల్ చేసింది.

జూలకల్లు గ్రామంలో కొండముచ్చు హల్‌చల్..

గుంటూరు: పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో కొండముచ్చు హల్ చల్ చేసింది. ఓ వ్యక్తి పై కొండముచ్చు దాడికి పాల్పడటంతో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో రెండు రోజుల నుంచి పలువురు  గ్రామస్తులపై కొండముచ్చు దాడి చేసింది. కాగా.. ఆ కొండముచ్చును పెంచుకుంటున్న గ్రామస్తుడిపై... స్థానికులు పంచాయితీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-12-30T17:12:33+05:30 IST