కారు ఢీకొని భార్య కళ్లెదుటే భర్త మృతి
ABN , First Publish Date - 2020-03-02T14:01:41+05:30 IST
మేడ్చల్: దంపతులు రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొని భార్య కళ్లెదుటే భర్త మృతి చెందిన విషాద ఘటన మేడ్చల్ జిల్లా తుర్కపల్లి శివాలయం కమాన్ వద్ద జరిగింది.

మేడ్చల్: దంపతులు రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొని భార్య కళ్లెదుటే భర్త మృతి చెందిన విషాద ఘటన మేడ్చల్ జిల్లా తుర్కపల్లి శివాలయం కమాన్ వద్ద జరిగింది. రాజీవ్ రహదారిపై దంపతులు రోడ్డు దాటుతున్న సమయంలో భార్య కళ్ల ముందే భర్త బాలకృష్ణ(55)ను కారు ఢీకొట్టింది. దీంతో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం ఒడిశాలోని.. గజపతి జిల్లా గూరండి మండలం సరిపురంగా గుర్తించారు.