టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారు?: పేర్నినాని

ABN , First Publish Date - 2020-03-16T21:40:22+05:30 IST

కరోనా ప్రభావముంటే రాజధాని గ్రామాల్లో టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు మాస్క్‌లు వేసుకొని నామినేషన్లు ఎందుకు వేయలేదని నిలదీశారు.

టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారు?: పేర్నినాని

అమరావతి: కరోనా ప్రభావముంటే రాజధాని గ్రామాల్లో టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు మాస్క్‌లు వేసుకొని నామినేషన్లు ఎందుకు వేయలేదని నిలదీశారు. గవర్నర్, డీజీపీ, సీఎస్ కుర్చీలకు విలువ లేకుండా చేసిందీ టీడీపీ అధినేత చంద్రబాబేనని చెప్పారు. ఎస్‌ఈసీ రమేష్‌ ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారని మండిపడ్డారు. నాయకత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు.. టీడీపీ తోక పార్టీలుగా మారొద్దని సూచించారు. వైసీపీ పాలన బాగోలేదంటున్న చంద్రబాబు.. నారా లోకేష్‌ను ఎంపీటీసీగా పోటీ చేయించాలని సవాల్ చేస్తున్నానని పేర్ని నాని సవాల్ విసిరారు.

Updated Date - 2020-03-16T21:40:22+05:30 IST