కోడి కిలో రూ.16

ABN , First Publish Date - 2020-03-12T10:03:18+05:30 IST

కరోనా దెబ్బకు పౌలీ్ట్ర పరిశ్రమ కుదేలవుతోంది. కొవిడ్‌-19 వైర్‌సకు జడిసి జనం చికెన్‌ జోలికి వెళ్లకపోవడంతో ధరలు నానాటికీ

కోడి కిలో రూ.16

  • కుదేలవుతున్న పౌలీ్ట్ర పరిశ్రమ

తణుకు, మార్చి 11: కరోనా దెబ్బకు పౌలీ్ట్ర పరిశ్రమ కుదేలవుతోంది. కొవిడ్‌-19 వైర్‌సకు జడిసి జనం చికెన్‌ జోలికి వెళ్లకపోవడంతో ధరలు నానాటికీ పతనమవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం లైవ్‌ చికెన్‌ కేజీ ధర రూ.16కు పడిపోయింది. నెల రోజుల నుంచి రోజుకు రూ.3 చొప్పున తగ్గుతూ వచ్చిన ధర రెండు రోజుల నుంచి రూ.10 మేర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి సంగతి ఎలాగున్నా రైతులు మాత్రం నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రోజూ వేలాది కోళ్లు అమ్మే వారికి ప్రస్తుతం వంద కేజీలు అమ్మాలంటే కటకటగా మారింది. దీంతో చిన్న రైతులు కోళ్లను విక్రయించే పరిస్థితి లేక, వాటికి మేత పెట్టలేక లబోదిబోమంటున్నారు. ఏదో ఒక రోజు ధరలు బాగుంటే అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో మేపుతూ వచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర పెరగకపోగా.. బరువు పెరిగాయని దీంతో రూ.200 విలువ చేసే కోడిని సైతం రూ.30కు ఇస్తానన్నా తీసుకునే వారే లేరని వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రధాన పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ లక్షలాది కోళ్లు విక్రయించేవారు. అలాంటిది కరోనా వైరస్‌ ఫ్రభావంతో రోజురోజుకూ విక్రయాలు తగ్గిపోయాయి.

Updated Date - 2020-03-12T10:03:18+05:30 IST