ప్రజలు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి: ఆళ్ల నాని

ABN , First Publish Date - 2020-05-09T22:45:22+05:30 IST

విజయనగరం జిల్లాలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఒకరు మృతి చెందారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వలస కార్మికుల వల్లే నాలుగు కేసులు నమోదయ్యాయని చెప్పారు.

ప్రజలు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి: ఆళ్ల నాని

అమరావతి: విజయనగరం జిల్లాలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఒకరు మృతి చెందారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వలస కార్మికుల వల్లే నాలుగు కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మొత్తం 73 కట్టడి ప్రాంతాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ప్రజలు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలని ఆళ్ల నాని సూచించారు.

Updated Date - 2020-05-09T22:45:22+05:30 IST