ఏలూరులో ప్రాణభయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్న కుటుంబాలు
ABN , First Publish Date - 2020-12-11T18:18:33+05:30 IST
వింత వ్యాధి బారిన పడేకన్నా ఊరు వదలి వెళ్లిపోవడమే మేలని ఏలూరు వాసులు భావిస్తున్నారు.
ప.గో.జిల్లా: ఏలూరు వాసులకు వింత వ్యాధి భయం తగ్గడంలేదు. తాగునీటి సరఫరా నిలిపివేసినా ప్రజల్లో భయం మాత్రం తగ్గడంలేదు. కుటుంబాలు ఊరు వదలి వెళ్లిపోతున్నాయి. వింత వ్యాధి బారిన పడేకన్నా ఊరు వదలి వెళ్లిపోవడమే మేలని ఏలూరు వాసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలు ఊరు వదలి వెళ్లిపోయాయి. మరికొన్ని కుటుంబాలు అదే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఖాళీ చేస్తున్నారు. ప్రజల్లో భయాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.