జూలై పెన్షన్ చెల్లింపులేవీ ?
ABN , First Publish Date - 2020-08-11T09:01:08+05:30 IST
రాష్ట్రంలో 11 జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెందిన పెన్షన్ దారులకు జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటివరకు చెల్లించలేదని ఏపీ జిల్లా
- జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్స్ అసోసియేషన్
అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 11 జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెందిన పెన్షన్ దారులకు జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటివరకు చెల్లించలేదని ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు మినహా మరే జిల్లాలోనూ పెన్షన్లు చెల్లించలేదని పేర్కొంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎ్‌స.రావత్‌కు సోమవారం అసోసియేషన్ విజ్ఞాపన పత్రం అందజేసింది. నెలవారీ పెన్షన్ల మీద ఆధారపడ్డ తమకు సకాలంలో చెల్లింపులు జరగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.మల్లేశ్వరరావు తెలిపారు.