-
-
Home » Andhra Pradesh » pension
-
పింఛన్ కోసం ఎదురుచూపులు
ABN , First Publish Date - 2020-04-07T10:31:33+05:30 IST
రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నెలలో ఇంకా పింఛన్లు అందలేదు. కరోనా కట్టడి చర్యల నేపథ్యంలో ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పింఛన్లను 50 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నెలలో ఇంకా పింఛన్లు అందలేదు. కరోనా కట్టడి చర్యల నేపథ్యంలో ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పింఛన్లను 50 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మిగిలిన 50 శాతం వేతనాలు ఆర్థిక శాఖ మినహా మిగతా శాఖల్లోని ఉద్యోగులందరికీ అందాయి.
ఆర్థికశాఖలో ఉన్న 6 విభాగాల్లోని ఉద్యోగుల వివరాలతో హెచ్‌ఆర్‌ఎంఎస్ అనే పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రక్రియ ఆలస్యంతో ఆ శాఖ ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందలేదు. అలాగే, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు పెన్షన్లు అందగా, ప్రభుత్వంలో పనిచేసి రిటైరైనవారికి ఇంకా పింఛన్ అందలేదు. కోత విధించగా మిగిలిన సగమూ తమకు ఇంతవరకూ ఇవ్వలేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.