పెద్దిరెడ్డీ.. మీ ఇలాకా అనుకుంటున్నారా

ABN , First Publish Date - 2020-10-03T07:24:53+05:30 IST

‘‘పెద్దిరెడ్డీ.. చిత్తూరు జిల్లా మీ ఇలాకా అనుకుంటున్నారా? దళితులంటే మీకు నచ్చదు. మా ఓట్లు కావాలి.

పెద్దిరెడ్డీ.. మీ ఇలాకా  అనుకుంటున్నారా

న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ 


మదనపల్లె: ‘‘పెద్దిరెడ్డీ.. చిత్తూరు జిల్లా మీ ఇలాకా అనుకుంటున్నారా? దళితులంటే మీకు నచ్చదు. మా ఓట్లు కావాలి. మా సీట్లు కావాలి. మా అధికారం కావాలి. అంబేడ్కర్‌ వారసులమైన మా ఓట్లతో గెలిచి, మమ్మల్నే హింసిస్తారా?’’ అంటూ న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు జరుగుతుంటే, ఎక్కడో రామకృష్ణతో మీకు గొడవలు జరిగితే, డాక్టర్‌ సుధాకర్‌ను వాడూ, వీడూ అని మాట్లాడడం, డాక్టర్‌ అనితారాణిని మసుషులతోనే మాట్లాడదని అసహ్యంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు.


రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ప్రణాళిక ఉద్యమాల పురిటిగడ్డ అయిన మదనపల్లె వేదికగా మొదలైందంటూ హెచ్చరించారు. మదనపల్లెలో శుక్రవారం సాయంత్రం జడ్జి రామకృష్ణ, రిటైర్డ్‌ జడ్జి గుర్రప్పతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చలో మదనపల్లె’ను అడ్డుకున్న ప్రభుత్వంపై, పోలీసులపై మండిపడ్డారు. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులను ఎక్కడికక్కడ  నిర్బంధించారని ఆరోపించారు.


అయినా ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించేలా కార్యక్రమాన్ని విజయవంతం చేశారంటూ.. దళిత సంఘాల నాయకులను అభినందించారు. 2024లో దళితుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఉద్యమిస్తామని వెల్లడించారు.

Updated Date - 2020-10-03T07:24:53+05:30 IST