పెద్దిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: సీపీఐ

ABN , First Publish Date - 2020-06-23T09:54:58+05:30 IST

‘‘కరోనా విపత్తు సమసిన తర్వాత అమరావతి నుంచి రాష్ట్ర రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి పెద్దిరెడ్డి

పెద్దిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: సీపీఐ

‘‘కరోనా విపత్తు సమసిన తర్వాత అమరావతి నుంచి రాష్ట్ర రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాం. ఆ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతి రాజధాని అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా తరలిస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు రావా? అని ప్రశ్నించారు. 188 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  


ఇళ్ల నిర్మాణాలపై  రాజకీయ వివక్ష తగదు

పట్టణ గృహ నిర్మాణ పథకం ద్వారా రాష్ట్రంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం ఈ మేరకు సీఎంకు లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ముతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై రాజకీయ వివక్ష తగదని రామకృష్ణ పేర్కొన్నారు. 

Read more