తుది తీర్పునకు లోబడే ఫీజు చెల్లింపు

ABN , First Publish Date - 2020-07-10T09:11:10+05:30 IST

పీజీ మెడికల్‌, డెంటల్‌ విద్యార్థుల ఫీజు చెల్లింపు తుది తీ ర్పునకు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో సీటు వచ్చినా ఆయా కాలేజీల్లో ఫీజు కట్టేందుకు తమను

తుది తీర్పునకు లోబడే ఫీజు చెల్లింపు

  • పీజీ మెడికల్‌ అడ్మిషన్లపై హైకోర్టు స్పష్టీకరణ

పీజీ మెడికల్‌, డెంటల్‌ విద్యార్థుల ఫీజు చెల్లింపు తుది తీ ర్పునకు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో సీటు వచ్చినా ఆయా కాలేజీల్లో ఫీజు కట్టేందుకు తమను అనుమతించడం లేదంటూ విద్యార్థులు, మెడికల్‌ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభు త్వం జారీ చేసిన జీవో 56ను సవాల్‌ చేస్తూ పలు ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీటిపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజును ప్రస్తుతం చెల్లించేలా, అయితే, హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఫీజు చెల్లింపు ఉండేలా ఇరుపక్షాలూ ఓ అవగాహనకు వచ్చినట్లు ఇటీవల కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థు లు, ప్రైవేటు మెడికల్‌ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకు వివరించాయి.


విద్యార్థుల నుంచి మూడేళ్లకుగాను మరో రూ.45 వేల ఫీజు వసూలు చేయాలని నిర్ణయించామని, ఇందుకు విద్యార్థులూ అంగీకరించారని  ప్రైవేటు కాలేజీల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే, తమ ఒప్పంద నిబంధనల్లో ఈ విషయం ప్రస్తావన లేదని, ఈ వ్యవహారం తుది తీర్పునకు లోబడి ఉం డేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని విద్యార్థుల తరఫు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తుది తీర్పునకు లోబడే ఫీజుల చెల్లింపు ఉంటుందని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-07-10T09:11:10+05:30 IST