వేతన బకాయిలు, డీఏ చెల్లించండి
ABN , First Publish Date - 2020-10-24T08:57:52+05:30 IST
కరోనాతో కుంటుపడిన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు నిలిపివేసిన 50 శాతం వేతన బకాయిలను,

సీఎం జగన్కు ఏపీ ఎన్జీవో సంఘం వినతి
అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): కరోనాతో కుంటుపడిన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు నిలిపివేసిన 50 శాతం వేతన బకాయిలను, మూడు డీఏలను తక్షణమే చెల్లించాలని ఏపీ ఎన్జీవో సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖరరెడ్డి, బండి శ్రీనివాసరావు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహనరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు.
ఉద్యోగుల సమస్యలతోపాటు సీపీఎస్, పీఆర్సీ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని చంద్రశేఖర్రెడ్డి వెల్లడించారు. కరోనా సోకిన ఉద్యోగులకు 30 రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేయాలని, కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని సీఎంను కోరామని చెప్పారు.