రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం దారుణం: పవన్

ABN , First Publish Date - 2020-12-30T19:28:41+05:30 IST

అమరావతి: రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం దారుణం: పవన్

అమరావతి: రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాదపు చర్యగా దీనిని అభివర్ణించారు. హిందూ ఆలయాలపై దాడులను సీఎం ఎందుకు ఖండించడం లేదని పవన్ ప్రశ్నించారు. జగన్‌ ఏ మతాన్ని విశ్వసించినా.. పరమతాన్ని గౌరవించాలన్నారు. గత దాడులను పట్టించుకోక పోవడం వల్లే వరుసగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రణాళికాబద్ధంగానే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయాలపై దాడుల విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని పవన్ డిమాండ్ చేశారు.


Updated Date - 2020-12-30T19:28:41+05:30 IST