పవన్ ఫ్లెక్సీ విషయంలో అమరావతిలో గొడవ
ABN , First Publish Date - 2020-09-03T17:13:42+05:30 IST
టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెప్టెంబర్- 02న పుట్టిన రోజు జరుపుకున్న విషయం విదితమే.

గుంటూరు : టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెప్టెంబర్- 02న పుట్టిన రోజు జరుపుకున్న విషయం విదితమే. ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే చాలు మెగాభిమానులు, జనసేన కార్యకర్తల ఆనందానికి అవధులుండవ్. అయితే ఈ బర్త్ డే రోజే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా.. అమరావతి మండలం లింగాపురం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందుకు కారణం ఫ్లెక్సీలు.
ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టొద్దని ఓ వర్గం వారు వాదించగా.. ఇక్కడే పెడతామని ఇంకో వర్గం బదులిచ్చింది. ఇలా మాటామాటా పెరగడంతో అది కాస్త ఘర్ఫణకు దారి తీసింది. ఈ క్రమంలో ఇరువర్గీయుల్లో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టి గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసుకున్న అమరావతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.