ప్రజాస్వామ్యానికి ఊపిరి: పవన్‌

ABN , First Publish Date - 2020-05-30T07:37:47+05:30 IST

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేసులో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

ప్రజాస్వామ్యానికి ఊపిరి: పవన్‌

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేసులో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసిందని వ్యాఖ్యానించారు. ‘హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచింది. రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వాలు తమకు నచ్చిన విధంగా మార్చుకోవాలని చూస్తే న్యాయ విభాగాలు రక్షిస్తాయి అనే విషయాన్ని రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా మరోమారు అవగతమైంది’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-30T07:37:47+05:30 IST