ప్రభావశీలి వెంకయ్య నాయుడు: పవన్‌ కల్యాణ్‌

ABN , First Publish Date - 2020-05-10T10:13:45+05:30 IST

‘‘ప్రభావశీలి వెంకయ్యనాయుడు. మొక్కవో ని వ్యక్తిత్వం.. విలక్షణ రాజకీయ జీవితం.. అమ్మ భాషపై అమితమైన మక్కువ.. చతురత నిండిన వాక్చాతుర్యం..

ప్రభావశీలి వెంకయ్య నాయుడు: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభావశీలి వెంకయ్యనాయుడు. మొక్కవో ని వ్యక్తిత్వం.. విలక్షణ రాజకీయ జీవితం.. అమ్మ భాషపై అమితమైన మక్కువ.. చతురత నిండిన వాక్చాతుర్యం.. ఏ విషయంపైనైనా నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడే ఆయన నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అనిపిస్తుంది’’ అని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పవన్‌  కల్యాణ్‌ మధ్య శనివారం ఫోన్‌  సంభాషణ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో పవన్‌ శనివారం ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-05-10T10:13:45+05:30 IST