-
-
Home » Andhra Pradesh » Pawan Kalyan
-
ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ ఏమైంది? : పవన్
ABN , First Publish Date - 2020-12-10T22:30:50+05:30 IST
ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ ఏమైందని ప్రభుత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

అమరావతి: ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ ఏమైందని ప్రభుత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లయిందని.. ప్రిలిమ్స్‌లో 51 తప్పులు వచ్చాయని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల అభ్యంతరాలను ఏపీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రూప్ 1 పరీక్ష తేదీలను వాయిదా వేస్తే ఇతర పరీక్షలకు సిద్ధమవుతున్న యువతలో ఆందోళన తగ్గుతుందని ఆయన చెప్పారు.