-
-
Home » Andhra Pradesh » Pawan Kalyan
-
మంత్రాలయం ఆస్తులను అమ్మొద్దు:పవన్
ABN , First Publish Date - 2020-11-28T01:43:03+05:30 IST
మంత్రాలయ మఠం భూములు, ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నామని జనసేనా అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు.

అమరావతి: మంత్రాలయ మఠం భూములు, ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. హిందూ ఆలయాలకు సంబంధించిన భూములను విక్రయిస్తే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తోందన్నారు.
దేవదాయశాఖ భూములకు ప్రభుత్వం ట్రస్ట్రీగా మాత్రమే వ్యవహరించాలని సూచించారు. ఆస్తులను సంరక్షించాలి తప్ప అమ్మడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు కూడా ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజావ్యతిరేకతతోనే టీటీడీ ఆస్తుల విక్రయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. టీటీడీ ఆస్తుల విక్రయ నిలుపుదల జీవోను అన్ని ఆలయాలు, మఠాలకు వర్తింపజేయాలని చెప్పారు. దాతలు ఇచ్చిన ఆస్తులను అమ్మకానికి పెడితే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హితువు పలికారు.