ప్రభుత్వం స్పందించకపోతే నిరసన దీక్షలు చేస్తాం: పవన్‌

ABN , First Publish Date - 2020-12-05T16:33:00+05:30 IST

నెల్లూరు: రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ప్రభుత్వం స్పందించకపోతే నిరసన దీక్షలు చేస్తాం: పవన్‌

నెల్లూరు: రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మద్యపానం ద్వారా వచ్చిన ఆదాయం రైతులకు కేటాయించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 7న నిరసన దీక్షలు చేస్తామన్నారు. తుపాను కారణంగా పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని పవన్ పేర్కొన్నారు. కావలిలో అక్రమ లే అవుట్‌ వల్ల వరద నీరు బయటకు పోవట్లేదన్నారు. రైతులకు భరసా, మనోధైర్యం ఇవ్వడం కోసమే పర్యటిస్తున్నానని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-12-05T16:33:00+05:30 IST