-
-
Home » Andhra Pradesh » pavan kalyan wishes jp nadda
-
ప్రజల పార్టీగా ఎదిగిన బీజేపీకి శుభాకాంక్షలు: పవన్
ABN , First Publish Date - 2020-04-07T10:40:23+05:30 IST
‘‘భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఊపిరి పోసుకొంది. నేటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంది.

అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ‘‘భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఊపిరి పోసుకొంది. నేటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంది. 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి జనసేన తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో దేశం నలువైపులా విస్తరించిన బీజేపీ ప్రజల పార్టీగా అవిర్భవించింది. వ్యవస్థాపక నేతల ఆశలను, ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు శుభాభినందనలు’’అనిపవన్ కల్యాణ్ పేర్కొన్నారు.