‘పట్టిసీమ’ నుంచి నీటి విడుదల

ABN , First Publish Date - 2020-10-31T08:05:33+05:30 IST

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 12 పంపుల ద్వారా 4,248 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వకు..

‘పట్టిసీమ’ నుంచి   నీటి విడుదల

పోలవరం, అక్టోబరు 30 : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 12 పంపుల ద్వారా 4,248 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డీఈ ఖండవల్లి వరప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. గోదావరి నీటి మట్టం 16.38 మీటర్లకు చేరుకోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.  

Read more