-
-
Home » Andhra Pradesh » Pattabhi Ram fire on AP Govt
-
అది జగనన్నకబ్జా పథకం: పట్టాభిరామ్
ABN , First Publish Date - 2020-11-25T21:01:26+05:30 IST
అది జగనన్నతోడు పథకం కాదు..జగనన్నకబ్జా పథకం..

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మాట్లాడుతూ.. అది జగనన్నతోడు పథకం కాదని..జగనన్నకబ్జా పథకమన్నారు. ప్రజల సొమ్ముని ప్రభుత్వం ప్రకటనల పేరుతో దుబారా చేస్తోందని విమర్శించారు. కేంద్రం చిరువ్యాపారుల కోసం మే నెలలో పథకాన్ని ప్రారంభిస్తే.. తానే కొత్తగా చేస్తున్నట్లు జగన్ కొండంత ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. కేంద్రం ప్రకటించిన పథకాన్ని కబ్జా చేసి..అధికారపార్టీ రంగులేసి జగనన్న తోడు అంటే సరిపోతుందా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు.