బీమా అర్హత కలిగిన రైతుల సంఖ్యను 9లక్షలకు తగ్గించారు: పట్టాభి

ABN , First Publish Date - 2020-12-15T20:30:50+05:30 IST

వైఎస్‌ఆర్‌ పంటల బీమాకు రూ.1.252 కోట్లు ఇస్తున్నామని ప్రకటన ఇచ్చి...కేవలం..

బీమా అర్హత కలిగిన రైతుల సంఖ్యను 9లక్షలకు తగ్గించారు: పట్టాభి

అమరావతి: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినదానికి...పత్రికా ప్రకటనలకు పొంతన లేదని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరాం విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ పంటల బీమాకు రూ.1.252 కోట్లు ఇస్తున్నామని ప్రకటన ఇచ్చి...కేవలం రూ.918 కోట్లు మాత్రమే జమ చేస్తున్నారని ఆరోపించారు. బీమా అర్హత కలిగిన రైతుల సంఖ్యను కూడా 9లక్షలకు తగ్గించారన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కనీసం 50 శాతం కూడా పంటల బీమా ఇవ్వలేదని విమర్శించారు. బీమా ప్రీమియం కట్టకుండా సీఎం జగన్‌ రైతుల్ని నట్టేట ముంచారని పట్టాభిరాం అన్నారు.

Updated Date - 2020-12-15T20:30:50+05:30 IST