ఏపీ ప్రజలు నియంత పాలనలో ఉన్నారు: పట్టాభి

ABN , First Publish Date - 2020-10-07T20:23:47+05:30 IST

అమరావతి: ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములు లాగా కలిసే ఉంటున్నామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తెలిపారు.

ఏపీ ప్రజలు నియంత పాలనలో ఉన్నారు: పట్టాభి

అమరావతి: ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములు లాగా కలిసే ఉంటున్నామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తెలిపారు. ఏపీలో ప్రజలు నియంత పాలనలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా చేస్తాను అంటే కుదరదన్నారు. దాడులు చేసి టీటీడీని భయపెట్టాలని అనుకోవడం జగన్ భ్రమే అవుతుందన్నారు. జగన్ చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని పట్టాభి పేర్కొన్నారు.


Read more