-
-
Home » Andhra Pradesh » Pattabhi
-
జగనన్న జీవనక్రాంతి కాదు.. జగనన్న భ్రాంతి: పట్టాభి
ABN , First Publish Date - 2020-12-10T23:27:55+05:30 IST
గనన్న జీవనక్రాంతి కాదు.. జగనన్న భ్రాంతిలా ఉందని టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభి వ్యాఖ్యానించారు.

అమరావతి: జగనన్న జీవనక్రాంతి కాదు.. జగనన్న భ్రాంతిలా ఉందని టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభి వ్యాఖ్యానించారు. 38 లక్షల గొర్రెలు, మేకలను అల్లనాగ్రూప్‌కి కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. పాడిపరిశ్రమను అమూల్ సంస్థకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. జగనన్న జీవనక్రాంతి పేరుతో మరో క్విడ్ ప్రోకో దోపిడికి తెరలేపారని ఎద్దేవా చేశారు. నచ్చిన కంపెనీలకు దోచిపెట్టడానికి రాష్ట్రమేమీ జగన్ జాగీరు కాదని తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారని.. పాలనను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.