మేం ఏంటో చూపిస్తాం: పరిటాల శ్రీరాం
ABN , First Publish Date - 2020-12-11T01:06:18+05:30 IST
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరాం తీవ్ర స్థాయిలో విమర్షించారు. మేం గల్లీ లెవల్ ఫ్యాక్షనిస్ట్... ఢిల్లీ లెవెల్ రేపిస్ట్ కాదని టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరాం అన్నారు.
అనంతపురం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరాం తీవ్ర స్థాయిలో విమర్శించారు. ‘మేం గల్లీ లెవల్ ఫ్యాక్షనిస్టులం... ఢిల్లీ లెవెల్ రేపిస్టులం కాదని’ టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరాం అన్నారు. మీడియా ఫోకస్ కోసం పరిటాల కుటుంబాన్ని విమర్శించడం సరికాదని వ్యాఖ్యానించారు. ‘నీ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితువు పలికారు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తు ఊరుకోమని’ చెప్పారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని వైసీపీ చేసినట్లు చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ఈ రోజు మీ చేతనవుతుందని పేర్లు మారుస్తున్నారు... మా టైం వచ్చినప్పుడు మేం ఏంటో చూపిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. గంగలకుంట చెరువుకు నీటిని విడుదల చేస్తుంటే అడ్డుకున్నది ఎవరో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై టీడీపీ పోరాడుతుందని చెప్పారు.