ఏపీలో సంక్షేమం మాటున సంక్షోభం: పంచుమర్తి అనురాధ
ABN , First Publish Date - 2020-02-10T18:09:14+05:30 IST
ఏపీలో సంక్షేమం మాటున సంక్షోభం: పంచుమర్తి అనురాధ
అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఏపీలో సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏడు లక్షల పెన్షన్లు రద్దు చేసి పేదల పొట్ట కొట్టారని మండిపడ్డారు. టీడీపీ కంటే అదనంగా 6 లక్షల పెన్షన్లు ఇచ్చామని వైసీపీ అబద్ధాలు చెబుతోందన్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు రూ.600 కోట్ల జీతాలిచ్చి పేదల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 20 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసిందన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలను వైసీపీ టార్గెట్ చేసిందని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.