-
-
Home » Andhra Pradesh » Panchayati Raj department
-
గత ప్రభుత్వంలో ‘పనులు’ రద్దు
ABN , First Publish Date - 2020-06-23T09:09:42+05:30 IST
పంచాయతీరాజ్ శాఖలో గత టీడీపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 1కు ముందు మంజూరుచేసిన 7,282 పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం

- పంచాయతీరాజ్ శాఖ కీలక నిర్ణయం
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ శాఖలో గత టీడీపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 1కు ముందు మంజూరుచేసిన 7,282 పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అంతకు ముందు ప్రభుత్వంలో మంజూరుచేసిన పనులను నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది. మంజూరైనప్పటికీ.. ఇంకా మొ దలుపెట్టని పనులను రద్దు చేస్తున్నట్టు అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనందున 25% కంటే త క్కువ చేసిన పనులతో పాటు అంతకంటే ఎక్కువ చేసిన రూ.3118.38 కో ట్లపనులను కూడా రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
పంచాయతీరాజ్‌కు సంబంధించి మైదాన ప్రాంతంలోని పనులు 909, ఎస్సీ కాంపొనెంట్ 3,712 పనులు, ఎస్టీ కాంపోనెంట్ 596 పనులు, ఎంఆర్‌ఆర్ 467 పనులు, పీఆర్ రోడ్ల పునర్నిర్మాణ పనులు 133, పీఆర్ బిల్డింగ్స్ 78, ఆర్డీఎఫ్ 709 పనులు, ఉపాధి అప్‌గ్రేడ్ పనులు 111, ఎస్‌ఈసీ 391, ఎస్టీసీ 105, పీఆర్ రోడ్ అసెట్స్ 71తో కలిపి మొత్తం 7,282 పనులను రద్దు చేస్తూ పంచాయతీరాజ్ ్ధశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.