-
-
Home » Andhra Pradesh » Panchayat today on waivers
-
ఎత్తిపోతలపై నేడు పంచాయితీ!
ABN , First Publish Date - 2020-05-13T09:01:39+05:30 IST
నీటి పంపకాల విషయంలో కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీరు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన రాయలసీమ దుర్భిక్ష నివారణ ఎత్తిపోతల పథకం ప్రధానంగా చర్చకు రానుంది.

అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): నీటి పంపకాల విషయంలో కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీరు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన రాయలసీమ దుర్భిక్ష నివారణ ఎత్తిపోతల పథకం ప్రధానంగా చర్చకు రానుంది. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత నెలకొల్పడానికి.. వివాదాలను కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) ద్వారా పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీరు అధ్యక్షతన కేంద్ర జలవనరుల శాఖ ఓ కమిటీ ఏర్పాటుచేసింది.
దీని తొలి సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు స్కైప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి దీటైన సమాధానం చెప్పేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ సన్నద్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి భేటీలో ఏం జరగనుంది అనేది ఆసక్తిగా మారింది.