-
-
Home » Andhra Pradesh » Pancharamas on postcard
-
పోస్టు కార్డుపై పంచారామాలు
ABN , First Publish Date - 2020-12-10T09:29:18+05:30 IST
అమరారామం(అమరావతి), సోమారామం(భీమవరం), క్షీరారామం(పాలకొల్లు), ద్రాక్షారామం, కుమారారామం(సామర్లకోట) ఇవన్నీ పంచారామాలు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : అమరారామం(అమరావతి), సోమారామం(భీమవరం), క్షీరారామం(పాలకొల్లు), ద్రాక్షారామం, కుమారారామం(సామర్లకోట) ఇవన్నీ పంచారామాలు. ఈ పుణ్యక్షేత్రాల చిత్రాలతో తపాల శాఖ పోస్టల్ కార్డులను రూపొందించింది. వాటిని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడలో బుధవారం ఆవిష్కరించారు. చీఫ్ పోస్ట్‌మాస్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు, పోస్ట్ మాస్టర్ జనరల్ టీఎం శ్రీలత పాల్గొన్నారు.