-
-
Home » Andhra Pradesh » paid to workers and employees Salaries
-
లాక్‌డౌన్‌లో పూర్తి వేతనాలు: సీఎస్ ఆదేశం
ABN , First Publish Date - 2020-03-24T09:47:07+05:30 IST
లాక్‌డౌన్ కాలంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు పూర్తిగా వేతనాలు, జీతాలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. కా ర్మికులు, ఉద్యోగులకు ఇచ్చే

లాక్‌డౌన్ కాలంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు పూర్తిగా వేతనాలు, జీతాలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. కా ర్మికులు, ఉద్యోగులకు ఇచ్చే వేతనాలైనా.. నెలవారీ జీతాలైనా పూర్తిగా చెల్లించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే అంటువ్యాధుల చట్టం కింద తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. అలాగే లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, చేపల వంటి వాటి సరఫరాలో అవరోధాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.