-
-
Home » Andhra Pradesh » Padmanabham news
-
కొండంత వెలుగు
ABN , First Publish Date - 2020-12-15T09:19:59+05:30 IST
విశాఖ జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభస్వామి దీపోత్సవం సోమవారం కన్నులపండువగా జరిగింది.

పద్మనాభం : విశాఖ జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభస్వామి దీపోత్సవం సోమవారం కన్నులపండువగా జరిగింది. కరోనా నేపథ్యంలో భక్తులను అనుమతించకపోవడంతో 1,300 మంది వలంటీర్లే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి పావంచా వద్ద ఉత్సవ విగ్రహాలను ఉంచి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆలయాల ధర్మకర్త సంచయిత విశేష అర్చనలు చేశారు. జేగంట కొట్టిన వెంటనే ముఖ్యఅతిథులు, ఈవో, వలంటీర్లంతా కలిసి గిరి మెట్లకు ఇరువైపులా అమర్చిన 1,286 ప్రమిదలను వెలిగించారు.