పారిశుద్ధ్య కార్మికులకు పాదాభిషేకం

ABN , First Publish Date - 2020-04-07T21:35:11+05:30 IST

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న నేపథ్యంలో..

పారిశుద్ధ్య కార్మికులకు పాదాభిషేకం

రాజమండ్రి: కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న నేపథ్యంలో.. సైనికుల్లా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాదాభివందనం చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే కాళ్లు కడిగి వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు జక్కంపూడి గణేష్, వైసీపీ నేత శివరామ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓ గొప్ప సంస్కారానికి నాంది పలుకుతూ ప్రాణాలు కాపాడుతున్న కార్మికులకు ఎమ్మెల్య పాదాభివందనం చేయడం అందరిలో సరికొత్త చైతన్యానికి నాంది పలికింది. 

Read more