ఏపీలో చాపకిందనీరులా కరోనా వైరస్ వ్యాప్తి
ABN , First Publish Date - 2020-04-21T14:04:27+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో చాపకిందనీరులా కరోనా వైరస్ వ్యాప్తిస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చాపకిందనీరులా కరోనా వైరస్ వ్యాప్తిస్తోంది. రాష్ట్రంలో కరోనా మూడో దశ మరింత ముందుకెళ్లినట్టు సమాచారం. దాదాపు 40 మందికి కరోనా వైరస్ ఎలా వచ్చిందో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఎవరి ద్వారా వైరస్ వచ్చిందనేది తెలిస్తేనే అడ్డుకట్ట వేసే అవకాశముందని అధికారులంటున్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రజలు సహకరించకపోతే చాలా కష్టమని అధికారులు వ్యాఖ్యానించారు.