అనాథ బాలలకు కొవిడ్‌ పరీక్షలు: డీజీపీ

ABN , First Publish Date - 2020-07-15T09:19:41+05:30 IST

బాలకార్మికులు, అనాథ బాలలను గుర్తించి కొవిడ్‌ పరీక్షలు చేయించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. ఆపరేషన్‌ ...

అనాథ బాలలకు కొవిడ్‌ పరీక్షలు: డీజీపీ

‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ ఆరో విడత ప్రారంభం

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): బాలకార్మికులు, అనాథ బాలలను గుర్తించి కొవిడ్‌ పరీక్షలు చేయించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం లాక్‌డౌన్‌తో 3నెలలుగా ఆగిపోయింది. తాజాగా ఆరోవిడత కార్యక్రమాన్ని మంగళగిరి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి డీజీపీ ప్రారంభించారు. శానిటైజర్లు, మాస్కులు, థర్మల్‌ స్కానర్లు, టూత్‌పే్‌స్ట, బ్రష్‌లతో కూడిన కిట్లను తీసుకెళ్లే వాహనాలకు పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సొంత బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. మహిళ, శిశుసంక్షేమ, వైద్య ఆరోగ్య, కార్మిక శాఖలతోపాటు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని జిల్లాల ఎస్పీలకు సూచించారు. కాగా, మంగళవారం నుంచి వారంరోజులపాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా ముస్కాన్‌ నిర్వహించనున్నట్టు కృష్ణాజిల్లా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మచిలీపట్నంలో వెల్లడించారు.

Updated Date - 2020-07-15T09:19:41+05:30 IST